Close Menu

    Subscribe to Updates

    Get the latest creative news from FooBar about art, design and business.

    What's Hot

    Epic – First Semester Review: Anand Deverakonda and Vaishnavi Chaitanya Bring Modern Love to London

    September 11, 2026

    Mandaadi Movie Review: Soori and Suhas Make This Coastal Action Drama Worth Watching

    September 10, 2026

    Sardar 2 Movie Review: A Big Spy Thriller That Doesn’t Quite Match the Original

    September 10, 2026
    Facebook X (Twitter) Instagram
    Movierulz
    Subscribe
    • Home
    Movierulz
    Home - TV Series - ‘House of the Dragon’ సీజన్ 3 ఎంట్రీ అదిరింది.. ‘బాటిల్ ఆఫ్ ది గల్లెట్’తో ఊచకోత!
    TV Series

    ‘House of the Dragon’ సీజన్ 3 ఎంట్రీ అదిరింది.. ‘బాటిల్ ఆఫ్ ది గల్లెట్’తో ఊచకోత!

    హౌస్ ఆఫ్ ది డ్రాగన్’ సీజన్ 3 ఎపిసోడ్ 1 రివ్యూ! బాటిల్ ఆఫ్ ది గల్లెట్ యుద్ధం, జేస్ ఊహించని మరణం మరియు ఒళ్ళు గగుర్పొడిచే ట్విస్టుల పూర్తి విశ్లేషణ
    Vijay VarmaBy Vijay VarmaJune 22, 202603 Mins Read109 Views
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr WhatsApp Reddit Email
    © HBO
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    ‘హౌస్ ఆఫ్ ది డ్రాగన్’ (House of the Dragon) సీజన్ 2 ముగింపు అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసిన సంగతి తెలిసిందే. ఎన్నో యుద్ధాలు, డ్రాగన్ల ఫైట్లు ఉంటాయని ఆశించిన ఫ్యాన్స్‌కు కేవలం పాత్రల మధ్య డైలాగులు, వచ్చే సీజన్‌లో చూసుకుందాం అనే హెచ్చరికలతోనే కథను ముగించారు. బడ్జెట్ లోటు, సమయాభావం వంటి కారణాల వల్ల మేకర్స్ అప్పట్లో అనుకున్న రేంజ్‌లో క్లైమాక్స్ ఇవ్వలేకపోయారు. కానీ, రెండేళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత వచ్చిన సీజన్ 3 మొదటి ఎపిసోడ్ మాత్రం ఫ్యాన్స్ పెట్టిన ప్రతి రూపాయికి, వారు కాచుకు కూర్చున్న ప్రతి క్షణానికి వంద శాతం న్యాయం చేసింది.

    షోరన్నర్ ర్యాన్ కాండల్ ఈ ప్రీమియర్ ఎపిసోడ్‌ను “టెలివిజన్ చరిత్రలోనే అత్యంత క్రేజీ ఎపిసోడ్” అని ఎందుకు అన్నారో స్క్రీన్‌పై చూస్తే అర్థమవుతుంది. సీజన్ 2 లో మిస్సయిన అసలైన మజాను ఈ ఒక్క ఎపిసోడ్‌లోనే రంగరించారు.

    అసలు ఏం జరుగుతోంది? (ఫ్లాష్‌బ్యాక్)

    © HBO

    రెండేళ్ల గ్యాప్ తర్వాత కథ మళ్లీ మొదలవడంతో అసలు ఎవరెవరు ఏ వైపు ఉన్నారనే గందరగోళం రావడం సహజం. క్లుప్తంగా చెప్పుకుంటే.. ఇది రైనీరా (Rhaenyra) మరియు రాజు ఏగాన్ II (King Aegon II) వర్గాల మధ్య జరుగుతున్న సింహాసన పోరు. సీజన్ 2 లో జరిగిన ‘బాటిల్ ఆఫ్ రూక్స్ రెస్ట్’ యుద్ధంలో డ్రాగన్ల ఫైట్ వల్ల రైనీస్ మరణించగా, ఏగాన్ తీవ్రంగా గాయపడ్డాడు. అతని తమ్ముడు ఏమండ్ (Aemond) అధికారాన్ని చేతుల్లోకి తీసుకున్నాడు.

    ఇప్పుడు సీజన్ 3 ప్రారంభంలో జరిగే యుద్ధాన్ని ‘బాటిల్ ఆఫ్ ది గల్లెట్’ (Battle of the Gullet) అని పిలుస్తారు. రైనీరా బలగాలను దెబ్బతీయడానికి ఏమండ్ వర్గం.. రైనీరాకు అండగా ఉన్న ‘సీ స్నేక్’ లార్డ్ కోర్లిస్ వెలారియన్ నావికాదళంపై దాడికి దిగుతుంది. ఇందుకోసం వారు కోర్లిస్ పాత శత్రువులైన ‘ట్రైయార్కీ’ నౌకాదళంతో చేతులు కలిపారు.

    మొదటి అర్ధగంట.. నెమ్మదిగా సాగిన కథనం:

    ఎపిసోడ్ ప్రారంభమైన మొదటి 30 నిమిషాలు సీజన్ 2 లో మిగిలిపోయిన కొన్ని లూజ్ ఎండ్స్ (మిగిలిపోయిన కథలు) పూరించడానికే సరిపోయింది.

    • రాజు ఏగాన్ కింగ్స్ ల్యాండింగ్ నుండి తప్పించుకోవడం,
    • లేడీ రైన్హా టార్గారియన్ ‘షీప్‌స్టీలర్’ అనే డ్రాగన్‌ను లొంగదీసుకోవడం,
    • డెమన్ టార్గారియన్ (మాట్ స్మిత్) ఉత్తరాది సైన్యంతో చేతులు కలపడం,
    • క్వీన్ అలిసెంట్ హైటవర్ (ఓలివియా కుక్) లొంగిపోవాలనే ఆలోచనలో ఉండటం.. వంటి సీన్లతో కథ కొంచెం నిదానంగా సాగుతుంది.
    • ఈ ఎపిసోడ్‌లో ఒర్ముండ్ హైటవర్ పాత్రలో జేమ్స్ నార్టన్ కొత్తగా ఎంట్రీ ఇచ్చాడు.

    గూస్‌బంప్స్ తెప్పించే క్లైమాక్స్.. ఒళ్ళు గగుర్పొడిచే సీన్!

    © HBO

    కథలో లార్డ్ కోర్లిస్ యుద్ధనౌక మీద అడుగుపెట్టిన దగ్గర నుండి.. చివరి 20 నిమిషాల పాటు స్క్రీన్‌పై నాన్‌స్టాప్ యాక్షన్ విధ్వంసం కనిపిస్తుంది. సముద్రపు సందుల గుండా కోర్లిస్ తన నౌకలను నడిపించే వ్యూహం అద్భుతంగా పండింది. కింద ఓడలు ఒకదానికొకటి బాణాలు, ఈటెలతో దాడి చేసుకుంటుంటే.. పైన ఆకాశంలో డ్రాగన్లు ఎగురుతూ ఓడలను బూడిద చేయడం విజువల్ వండర్ అని చెప్పాలి. సీజన్ 2 లాగా చీకట్లో కాకుండా, పగటి వెలుతురులోనే ఈ యుద్ధాన్ని చూపించడంతో గ్రాఫిక్స్ స్పష్టంగా, అద్భుతంగా అనిపించాయి.

    ఇక యుద్ధం మధ్యలో వచ్చే ఒక వింతైన సీన్ చూసి ప్రేక్షకులు షాక్‌కు గురికావడం ఖాయం. ప్రిన్స్ ఏమండ్ ఎటువంటి శబ్దం లేకుండా నిశ్శబ్దంగా వచ్చి, తన స్వంత తల్లి అలిసెంట్ పెదవులపై ముద్దు పెట్టుకుంటాడు (Oedipal Scene). ఆ సమయంలో అలిసెంట్ కళ్ళు పెద్దవిచేసి షాక్‌లో ఉండిపోతుంది. వెస్టెరోస్ ప్రపంచంలో ఇలాంటి వింత సంబంధాలు కొత్త కాకపోయినా, ఈ సీన్ మాత్రం ప్రేక్షకులకు కాస్త ఇబ్బందికరంగానే అనిపిస్తుంది.

    జేస్ (Jace) ఊహించని మరణం:

    © HBO

    ఈ యుద్ధంలో అత్యంత విషాదకరమైన ట్విస్ట్.. రైనీరా కుమారుడు జేస్ మరణం. తల్లి మాట వినకుండా, ఆమె తనను గదిలో బంధించినా సరే విడిపించుకుని జేస్ ఒంటరిగా తన డ్రాగన్‌పై యుద్ధానికి దూకుతాడు. దురదృష్టవశాత్తూ శత్రువుల దాడులకు అతని డ్రాగన్ సముద్రంలో మునిగిపోతుంది.

    జేస్ ఎలాగోలా సముద్రంలో తేలుతున్న ఒక చెక్కను పట్టుకుని ప్రాణాలు కాపాడుకుంటాడులే అని ప్రేక్షకులు ఊపిరి పీల్చుకునే లోపే.. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌ను చీల్చుకుంటూ ఒక బాణం వచ్చి అతని వెన్నులో దిగుతుంది. ఆ వెంటనే మరికొన్ని బాణాలు అతని గుండెల్లో, మెడలో గుచ్చుకుంటాయి. అత్యంత దారుణమైన పరిస్థితుల్లో జేస్ సముద్ర గర్భంలో కలిసిపోతాడు.

    చివరగా..
    ‘బాటిల్ ఆఫ్ ది గల్లెట్’ ఇరువర్గాలకూ భారీ నష్టాన్ని మిగిల్చింది. యుద్ధం అంటేనే వినాశనం అని ఈ ఎపిసోడ్ మరోసారి నిరూపించింది. ఏదేమైనా, ‘హౌస్ ఆఫ్ ది డ్రాగన్’ సీజన్ 3 మాత్రం మొదటి ఎపిసోడ్‌తోనే పాత వైభవాన్ని తిరిగి తెచ్చుకుందని చెప్పవచ్చు.

    HBO House of The Dragon
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Vijay Varma
    • Website
    • X (Twitter)

    Vijay Varma is a Chief Editor with 10 years of experience in digital media specializing in pop culture in film, television and entertainment industries. He has led cross-functional editorial teams in a wide variety of verticals, including Classic TV, Literature and Fantasy.

    Related Posts

    Why ‘Reacher’ Is the Perfect Action Series

    August 13, 2026

    Netflix Extends Stay at ‘Musafir Cafe,’ Greenlighting Season 2 of Hit Hindi Romance Series

    August 5, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Top Posts

    Vishwanath and Sons Review: Suriya Delivers an Emotional Drama Packed with Heart and Conflict

    August 14, 20261,193 Views

    Irumudi Review: Ravi Teja Gets Quiet and Surprisingly Vulnerable

    August 22, 2026622 Views

    Ramba Oorvasi Menaka Review: Allari Naresh Is Back in His Comedy Zone

    September 4, 2026451 Views

    Toxic Movie Review: Yash Goes Dark in a Stylish, Violent Gangster Saga

    August 26, 2026377 Views
    Don't Miss

    Epic – First Semester Review: Anand Deverakonda and Vaishnavi Chaitanya Bring Modern Love to London

    By Vijay VarmaSeptember 11, 2026

    Anand Deverakonda and Vaishnavi Chaitanya, who became one of the more talked-about pairs after Baby,…

    Mandaadi Movie Review: Soori and Suhas Make This Coastal Action Drama Worth Watching

    September 10, 2026

    Sardar 2 Movie Review: A Big Spy Thriller That Doesn’t Quite Match the Original

    September 10, 2026

    Mirzapur: The Movie Review: Big Action, Big Ambitions, But Not Quite the Same Magic

    September 4, 2026

    Subscribe to Updates

    Get the latest creative news from SmartMag about art & design.

    • Home
    © 2026 ThemeSphere. Designed by ThemeSphere.

    Type above and press Enter to search. Press Esc to cancel.